Cruelty Against Husband is the article of the week

My article on #CrueltyAgainstHusband featured as article of the week on #Telugu #Wikipedia on account of  (International Men’s Day)

You can view the article on the homepage throughout the week at https://te.wikipedia.org

You can directly go the article by clicking on https://te.wikipedia.org/wiki/%E0%B0%AD%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4_%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2_%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8C%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82

Bharta Palta Krauryam

19 నవంబరున జరుపబడే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా నేను వ్రాసిన భర్త పట్ల క్రౌర్యం వ్యాసం తెలుగు వికీపీడీయాలో ఈ వారం వ్యాసంగా ప్రచురింపబడినది.

ఈ ప్రచురణ చూడటానికి తెవికీ మొదటి పేజీకి వెళ్ళండి. https://te.wikipedia.org

నేరుగా ఈ వ్యాసానికి వెళ్ళటానికి ఈ లంకె పై క్లిక్ చేయండి. https://te.wikipedia.org/wiki/%E0%B0%AD%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4_%E0%B0%AA%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2_%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8C%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%82

Advertisements

ఆది పరాశక్తి

TeWiki AdiParashakti

My article “Adi Parashakti” featured as “Article of the week” on Telugu Wiki on account of Dus-e-rah.


(“ఆది పరాశక్తి” పై నేను వ్రాసిన వ్యాసం దసరా పండుగ సందర్భంగా “ఈ వారం వ్యాసం” గా పరిగణించబడినది.)

కల్ హో న హో

నైనా క్యాథరీన్ కపూర్ (ప్రీతీ జింటా) ఆవేశపరురాలైన ఒక యువతి. తన ఆవేశానికి కారణాలనేకం. భార్యా పిల్లలని (నైనా కి ఒక తమ్ముడు) గాలికి వదిలేసి తన తండ్రి ఆత్మహత్య చేసుకొన్నందుకు. బ్రతుకు తెరువు కోసం తన తల్లి జెన్నిఫర్ (జయా బచ్చన్) నడుపుతున్న రెస్టారెంట్ నష్టాలపాలై చివరి దశలో ఉన్నందుకు. తన కొడుకు ఆత్మహత్యకి కారణం జెన్నిఫరే అని కోడలిని తన నాన్నమ్మ లజ్జో (సుష్మా సేఠ్) అపార్థం చేసుకొన్నందుకు. తాము దత్తత తీసుకొన్న జియా అనే అమ్మాయిని ఇంటికి దురదృష్టం తెచ్చింది అని నాన్నమ్మ దూషిస్తున్నందుకు. ప్రతి రోజు ఇంట్లో పెరుతున్న అశాంతిని నైనా ఎదుర్కోవలసిందే. ఇటువంటి నైనా జీవితానికి ఒకే ఒక ఆటవిడుపు, అమాయకమైన తన MBA సహ విద్యార్థి, రోహిత్ (సైఫ్ అలీ ఖాన్)

ఈ చిత్రం గురించి తెవికీ లో మరింత చదవటానికి ఈ లంకెపై క్లిక్ చేయండి:

కల్ హో న హో

టెల్ మీ యువర్ డ్రీమ్స్

ఒంటరిగా నివసిస్తున్న తనని ఎవరో వెంబడిస్తున్నారు అని యాష్లీ అనుమాన పడుతుండటం (Somebody was following her అన్న వాక్యం) తో కథ మొదలవుతుంది. తను ఆఫీసు నుండి వచ్చిన సమయానికి ఎవరో తన ఇంటిలోని దీపాలని వెలిగించి ఉంచటం వలన తనకి ఆ అనుమానం కలుగుతుంది. తాను స్నానం చేస్తున్న సమయంలో తన పడక గదిలో అలికిడి కాగా, వెళ్ళి చూడగా, తన లోదుస్తులన్నీ చెల్లా చెదురుగా పడి ఉండటంతో తనను వెంబడించేవాడు మానసిక రోగిగా అనుమాన పడుతుంది. అద్దం పైన “నువ్వు చచ్చిపోతావు” (You will die) అని ఎవరో తన లిప్ స్టిక్ తోనే రాయడంతో తాను ఇంకా కలవరపడుతుంది.

ఈ  నవల గురించి తెలుగు వికీపీడియా లో  చదవటానికి ఈ లంకె పై క్లిక్ చేయండి.

టెల్ మీ యువర్ డ్రీమ్స్

రాయలసీమ సంస్కృతి

రాయలసీమ విజయనగర సామ్రాజ్యం లో భాగంగా శ్రీ కృష్ణదేవ రాయలచే పరిపాలించబడినది. అది వరకూ తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా హిరణ్యక రాష్ట్రంగా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై చోళుల ప్రభావం పెరిగినది. తెలంగాణ, కోస్తా ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ వైశాల్యంలో చిన్నదైననూ తెలుగు,తమిళం, కన్నడ మరియు ఉర్దూ కళల్లో, సంస్కృతుల్లో, సాహిత్యంలో ఈ ప్రాంతం యొక్క ప్రభావం బహు అధికం.
మరింత చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి: రాయలసీమ సంస్కృతి

పిక్టోరియలిజం

పిక్టోరియలిజం (ఆంగ్లం: Pictorialism) అనునది 19 ద్వితీయార్థంలో మరియు 20వ శతాబ్దంలో ఫోటోగ్రఫిని అంతర్జాతీయ స్థాయిలో నడిపించిన ఒక కళా ఉద్యమం. ఈ పదానికి ప్రామాణిక నిర్వచనం లేకున్ననూ ఇది సాధారణంగా యథాతథంగా ఏర్పడే ఛాయాచిత్రాన్ని కేవలం నమోదు చేయటానికి మాత్రమే పరిమితం కాకుండా,ఛాయాగ్రహకుడు ఏదో ఒక విధంగా దానిని మార్చి ఒక భావాత్మకమైన ఛాయాచిత్రాన్ని సృష్టించే శైలిని సూచిస్తుంది.

పిక్టోరియలిజం గురించి తెవికీలో నేను వ్రాసిన వ్యాసం జూన్ 2015లో ఈ వారం వ్యాసంగా ప్రచురితమైనది.

మరింత చదవటానికి ఈ క్రింది లంకె పై క్లిక్ చేయండి.

తెలుగు వికీపీడియాలో పిక్టోరియలిజం గురించి